వార్తలకు తిరిగి వెళ్లండి
భారీ లాభాల్లో ముగిసిన సూచీలు

వాహన, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల కొనుగోళ్లతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 989.94 పాయింట్లు పెరిగి 83,021.75 వద్ద, నిఫ్టీ 286.35 పాయింట్లు లాభపడి 25,514.30 వద్ద ముగిశాయి.
కమొడిటీ ధరలు తగ్గుతాయనే అంచనాలతో వాహన షేర్లకు డిమాండ్ పెరిగింది. నిఫ్టీ తొమ్మిది నెలల తర్వాత తొలిసారి 25,500 మార్కును దాటింది.
Comments
Loading comments...
