వార్తలకు తిరిగి వెళ్లండి
పసిడి కొనుగోళ్లకు పండగ ఊతం

పసిడి ధరలు గరిష్ఠ స్థాయుల నుంచి తగ్గడంతో దీపావళి, ధనత్రయోదశి సందర్భంగా బంగారం, వెండి కొనుగోళ్లు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి బంగారం కొనుగోళ్లు 30 శాతం, వెండి కొనుగోళ్లు 10 శాతం పెరిగినట్లు ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపింది.
ఈ పండగల సమయంలో సుమారు రూ.72 వేల కోట్ల విలువైన 52 టన్నుల బంగారం, రూ.5,400 కోట్ల విలువైన 300 టన్నుల వెండి విక్రయాలు జరిగినట్లు అంచనా వేసింది.
Comments
Loading comments...
