వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు 21 నగరాల్లో బ్యాంకులకు సెలవు

గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 24న దేశంలోని 21 నగరాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ సహా ఆయా నగరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు శాఖలు మూసివేస్తారు. ఈ సెలవు దేశవ్యాప్తంగా వర్తించదు.
అగర్తల, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడల్లో బ్యాంకులు పనిచేస్తాయి. సెలవు ఉన్న ప్రాంతాల్లోనూ యూపీఐ, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఐఎంపీఎస్ సేవలు అందుబాటులో ఉంటాయి.
Comments
Loading comments...
