వార్తలకు తిరిగి వెళ్లండి
ఇండియాలో బీవైడీ సంచలనం.. 20 వేల ఈవీల విక్రయం!

చైనా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం బీవైడీ (BYD) భారత మార్కెట్‌లో కీలక మైలురాయిని అందుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 20,000 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసినట్లు ప్రకటించి, నవంబర్ 20న ఢిల్లీలోని పీపీఎస్ బీవైడీ షోరూమ్‌లో 20,000వ వాహనాన్ని కస్టమర్‌కు అందజేసింది.
సంస్థ విక్రయిస్తున్న అట్టో 3 (9,000కు పైగా), సీలియన్ 7 (5,000కు పైగా) మోడళ్లే కలిపి 14,000కు పైగా యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచాయి.
Comments
Loading comments...
