వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీకి రూ.1.27 లక్షల కోట్ల పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్‌లోని రామాయపట్నంలో భారీ చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు బీపీసీఎల్ ఆమోదం తెలిపింది. రూ.1.27 లక్షల కోట్ల పెట్టుబడితో 9 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో ఈ అత్యాధునిక రిఫైనరీ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపారు.
Comments
Loading comments...
