వార్తలకు తిరిగి వెళ్లండి
బంగ్లాపై సఫారీల భారీ ఆధిక్యం

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 494 పరుగులు చేసింది. మార్క్యూస్ అకెర్‌మన్ (150), వియాన్ ముల్డర్ (100) శతకాలతో రాణించారు.
టోనీ డి జార్జి (66) అర్ధశతకం సాధించగా, మార్కో జాన్సెన్ (67) అజేయంగా క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 403 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
Comments
Loading comments...
