వార్తలకు తిరిగి వెళ్లండి
యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. సెలవు రోజు, పవిత్ర కార్తీక మాసం కావడంతో ఏకంగా 80,400 మంది స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తుల రద్దీతో ధర్మదర్శనానికి 5 గంటలు, వీఐపీ దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. ఆలయ పరిసరాలు, క్యూకాంప్లెక్స్, పార్కింగ్ ప్రాంతాలు కిక్కిరిశాయి. ఆలయానికి రూ.59,51,025 నిత్యాదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
