వార్తలకు తిరిగి వెళ్లండి
సింగరేణి కార్మికులకు శుభవార్త

సింగరేణిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల పిల్లలకు పదో తరగతి వరకు ఉచిత విద్య అందించాలని యాజమాన్యం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
సంస్థ పరిధిలోని 12 ఏరియాల్లో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది ఒప్పంద కార్మికుల కుటుంబాలకు ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది. సింగరేణి విద్యాసంస్థల్లో ఈ సదుపాయం కల్పించనున్నారు.
Comments
Loading comments...
