Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వసంతపురంలో కాటమయ్య స్వామి గ్రామోత్సవం

Anuroop Nov 13, 2026 10:50 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
Add as a preferred source on Google
వసంతపురంలో కాటమయ్య స్వామి గ్రామోత్సవం - Ushodayam
ధర్మవరం మండలం వసంతపురం గ్రామంలో గురువారం రాత్రి శ్రీ ముష్టూరు కాటమయ్య స్వామి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. పంటలు సమృద్ధిగా పండాలని రైతులు స్వామివారిని వేడుకుని పూలవర్షం కురిపించారు. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల కోలాహలంతో వసంతపురం గ్రామం సందడిగా మారింది.

Comments

G
Loading comments...