వార్తలకు తిరిగి వెళ్లండి
వరి కొయ్యలు కాల్చొద్దు

వరి కోతల తర్వాత పొలాల్లో మిగిలిన కొయ్యలను కాల్చవద్దని వ్యవసాయ అధికారులు సూచించారు. తిప్పర్తి మండలం ఇండ్లూరులో కొందరు రైతులు వరి కొయ్యలను తగలబెడుతున్నట్లు గుర్తించారు.
దీనివల్ల భూసారం, పోషకాలు దెబ్బతినడంతో పాటు వాయు కాలుష్యం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు. నేలలోని వానపాములు, మిత్ర పురుగులు, సూక్ష్మజీవులు నశిస్తాయని తెలిపారు.
Comments
Loading comments...
