Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరాహనదిలో ముగ్గురు యువకుల మృతి

Shruthi Nov 16, 2026 6:33 AM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
వరాహనదిలో ముగ్గురు యువకుల మృతి - Ushodayam
వరాహనదిలో స్నానానికి దిగి గల్లంతైన కేతేటి రిషి (18), కోడి జగదీష్‌ (20), ముప్పిడి నాగవంశీ (22) మృతదేహాలు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి. పెనుగొల్లుకు చెందిన ఈ ముగ్గురు యువకుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. కన్నబిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు జాతీయ రహదారిని గంటన్నరపాటు దిగ్బంధించారు.

Comments

G
Loading comments...