వార్తలకు తిరిగి వెళ్లండి
వరాహ నదిలో ముగ్గురు యువకుల మృతి

అనకాపల్లి జిల్లా పెనుగొల్లు వద్ద శనివారం వరాహ నదిలో స్నానానికి దిగి గల్లంతైన రిషి (18), నాగవంశీ (22), జగదీశ్ (20) మృతిచెందారు. ఆదివారం ఉదయం వారి మృతదేహాలు నదిలో తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు, పోలీసులు బయటకు తీశారు.
యువకులు విగతజీవులుగా మారడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. మృతదేహాలను అధికారులు పరిశీలించగా, బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని కాలనీవాసులు కోరారు.
Comments
Loading comments...
