వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు రూ.660 కోట్లు

విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ వ్యయం రూ.450 కోట్ల నుంచి రూ.660 కోట్లకు పెరిగింది. ప్లాట్‌ఫారాలు 8 నుంచి 14కి పెరుగుతాయి. 72 మీటర్ల ఎయిర్ కాన్‌కోర్స్‌లో 4 వేల మంది వేచి ఉండేలా సదుపాయాలుంటాయి.
450 కార్లు, 2 వేల బైక్‌ల పార్కింగ్ ఉంటుంది. మొదటి దశ వచ్చే ఏడాది డిసెంబరుకు, ప్రాజెక్టు 2028 డిసెంబరుకు పూర్తి చేయాలని లక్ష్యం. గురువారం కొత్త ఆకృతులు ప్రదర్శించగా, ఎంపీ శ్రీభరత్ పనులు పరిశీలించారు.
Comments
Loading comments...
