వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖ మేయర్ తండ్రి మృతి

విశాఖపట్నం మేయర్ ముక్కా శ్రావణి తండ్రి, తెదేపా నేత ముక్కా ముత్యాలనాయుడు గుండెపోటుతో శుక్రవారం ఉదయం మృతిచెందారు. ఆయన మృతి పట్ల పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెదేపా ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేసిన ముత్యాలనాయుడు 2000లో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. విశాఖ జిల్లా పార్టీ బీసీ విభాగం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
Comments
Loading comments...
