వార్తలకు తిరిగి వెళ్లండి
వినుకొండలో ధరణి రైస్ కేంద్రం ప్రారంభం

వినుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధరణి రైస్ కేంద్రాన్ని తహశీల్దార్ సురేశ్, పౌరసరఫరాల డిప్యూటీ తహశీల్దార్ సునీత ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించనున్నారు.
కేఎన్ఎం రకం బియ్యం కిలో రూ.50, బీపీటీ కిలో రూ.49 చొప్పున ఒక్కో కుటుంబానికి 26 కేజీల బస్తా విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
