వార్తలకు తిరిగి వెళ్లండి
విజయవాడలో మూలనపడిన ప్రభుత్వ సైకిళ్లు

విజయవాడలో విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వ సైకిళ్లు నిరుపయోగంగా మారుతున్నాయి. వెటర్నరీ కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్ద పెద్ద సంఖ్యలో నిల్వ ఉంచిన సైకిళ్లు సరైన నిర్వహణ లేక తుప్పు పట్టిపోతున్నాయి.
విద్యార్థులకు చేరాల్సిన సైకిళ్లు ఇలా వృథా అవుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి వాటిని వెంటనే పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...
