వార్తలకు తిరిగి వెళ్లండి
వీవో భవనానికి స్థలం కేటాయించాలని డిమాండ్

చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో వీవో భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా సంఘాల సమావేశాలు, బ్యాంకు లింకేజీ పనులకు భవనం అవసరమని సర్పంచ్ డోంగ్రె సంతోష్‌కు వినతిపత్రం అందించారు. వెంటనే స్థలం కేటాయించకపోతే తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...
