వార్తలకు తిరిగి వెళ్లండి
విఘ్నేశ్వర స్వామి ట్రస్టుకు రూ.50 వేల విరాళం

అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య ప్రసాదం ట్రస్టుకు రావులపాలెం మండలం ఊబలంకకు చెందిన దండు సత్యనారాయణ రాజు రూ.50 వేలు విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని ఆలయ అర్చకులకు అందజేశారు.
అర్చకులు దాతకు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ధర్మకర్తల మండలి ఛైర్మన్ సూర్యనారాయణ, ఈవో సత్యనారాయణ రాజు దాతను అభినందించారు.
Comments
Loading comments...
