వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యుత్ సమస్యల గుర్తింపునకు డ్రోన్లు

జిల్లాలో విద్యుత్ రంగంలోని సాంకేతిక సమస్యలను వేగంగా గుర్తించేందుకు డ్రోన్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ ఎం.లక్ష్మణరావు తెలిపారు. ఇందులో భాగంగా రాజీవ్ క్రీడా మైదానంలో క్షేత్రస్థాయి సిబ్బందికి డ్రోన్ ఆపరేషన్ శిక్షణ తరగతులను ప్రారంభించారు.
ఈ ఆధునిక సాంకేతికతను సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఈఈ పి.హరి, డీఈఈ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...
