Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం

Kiran Nov 12, 2026 2:25 PM వికారాబాద్General
Add as a preferred source on Google
విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం - Ushodayam
ముజాహిద్‌పూర్‌లోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో గురువారం కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఉన్నత విద్యావకాశాలు, వివిధ కోర్సులు, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...