వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థుల క్షేత్ర సందర్శన

పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు క్షేత్ర సందర్శనలో భాగంగా పశువైద్యశాల, ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించారు. అక్కడి సిబ్బంది అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు.
క్షేత్ర సందర్శనల ద్వారా పుస్తకాల్లో నేర్చుకున్న విషయాలను నిజజీవితంలో అన్వయించుకోవచ్చని హెచ్ఎం వెంకటరమణారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో లలితాదేవి, సుభాషిని, నవీన్, ప్రసాద్, కిషన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...
