వార్తలకు తిరిగి వెళ్లండి
వెంకటాపూర్: ప్రజావాణికి రెండు దరఖాస్తులు

వెంకటాపూర్ ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి రెండు దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో మూడ్ రాజు తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామన్నారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన ఏడుగురు అధికారులు పాల్గొన్నారని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నామని ఎంపీడీవో వెల్లడించారు.
Comments
Loading comments...
