వార్తలకు తిరిగి వెళ్లండి
గంగమ్మ ఆలయంలో చోరీ

యల్లనూరు మండలం వెంకటాంపల్లి గ్రామంలోని గంగమ్మ తల్లి ఆలయంలో గురువారం రాత్రి వెండి కిరీటం, నగదు చోరీకి గురైనట్లు గ్రామస్థులు తెలిపారు. ఆలయం ప్రారంభమైన 12 ఏళ్లలో ఇలాంటి ఘటన జరగలేదని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జాతర నిర్వహించి, హుండీ ఆదాయాన్ని లెక్కించాలని భావిస్తున్న తరుణంలో చోరీ జరిగిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
