వార్తలకు తిరిగి వెళ్లండి
వేంపల్లిలో ఐదు క్లస్టర్ కేంద్రాలు

వేంపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఐదు క్లస్టర్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ కుళ్లాయమ్మ తెలిపారు. అలవలపాడు, ఇడుపులపాయ, రామిరెడ్డిపల్లి, టీ.వెలంవారిపల్లి, వేంపల్లిలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈ నెల 20న నామినేషన్ల స్వీకరణ, 24న ఉపసంహరణ చేపడతారు. 29న సర్పంచ్ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.
Comments
Loading comments...
