వార్తలకు తిరిగి వెళ్లండి
వైరాలో రేపు 10 టన్నుల ఇసుక వేలం

వైరా మండలంలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 6.67 క్యూబిక్ మీటర్ల (10 టన్నుల) ఇసుకను గురువారం బహిరంగ వేలం వేయనున్నట్లు తహశీల్దార్ సురేశ్ బాబు తెలిపారు. క్యూబిక్ మీటరుకు కనీస ధర రూ.645గా నిర్ణయించారు.
వేలంలో పాల్గొనేవారు రూ.25 వేల డిపాజిట్ చెల్లించాలని సూచించారు. గురువారం మధ్యాహ్నం 4 గంటలకు తహశీల్దార్ కార్యాలయం వద్ద వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...
