వార్తలకు తిరిగి వెళ్లండి
వైన్స్ ఎదుట ఘర్షణ.. బీరు సీసాతో దాడి

వేలేరు తిరుమల వైన్స్ ఎదుట జరిగిన ఘర్షణలో లోక్య తండాకు చెందిన మూరావత్ నవీన్‌పై బీరు సీసాతో దాడి చేశారు. ఈ ఘటనలో కమ్మరిపేటకు చెందిన లావుడ్య తిరుపతి, బండ తండాకు చెందిన మాలోత్ దయాకర్ నిందితులుగా ఉన్నట్లు సమాచారం.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, ఇద్దరినీ తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై తూడిమెట్ల నరేష్ తెలిపారు. బహిరంగంగా మద్యం తాగి గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...
