వార్తలకు తిరిగి వెళ్లండి
వైద్య సేవలకు ఆందోళనల సెగ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్యారోగ్య శాఖలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె బుధవారానికి 30 రోజులకు చేరగా, ఆశా కార్యకర్తలు డిసెంబర్ 15 నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో 2 వేల మంది ఆశా కార్యకర్తలు, వెయ్యికిపైగా NHM ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, ఇతర సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలతో వైద్య సేవలకు ఆటంకం కలిగే అవకాశముంది.
Comments
Loading comments...
