Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారం రోజులుగా ముంపులో గుమ్ములూరు

Anuroop Nov 13, 2026 12:00 PM పశ్చిమగోదావరి General
Add as a preferred source on Google
వారం రోజులుగా ముంపులో గుమ్ములూరు - Ushodayam
ఆకివీడు మండలం గుమ్ములూరు గ్రామం వారం రోజులుగా ముంపులోనే ఉంది. ఇళ్లలోకి చేరిన నీరు నిల్వ ఉండటంతో రంగు మారి దుర్వాసన వెదజల్లుతోంది. పారిశుద్ధ్యం దెబ్బతినడంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వంటకు, తాగడానికి మంచినీరు కూడా అందుబాటులో లేదని వాపోతున్నారు. ముంపు నీటిలోనే జీవనం సాగిస్తూ పలువురు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...