వార్తలకు తిరిగి వెళ్లండి
ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి

అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్య పెంచాలని ఏపీడీ రవికుమార్ సూచించారు. గురువారం అద్దంకి ఎంపీడీవో కార్యాలయంలో జె.పంగులూరు, కొరిశపాడు మండలాల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
ప్రతి గ్రామంలో కనీసం 50 మంది కూలీలను పెంచి పనులు కల్పించాలని, ఇంటింటి ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. పనుల్లో పొరపాట్లకు తావులేకుండా నిర్దేశిత కొలతల ప్రకారం పనులు చేయించాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
