వార్తలకు తిరిగి వెళ్లండి
ఉడుత పిల్లతో చిన్నారుల అనుబంధం

మోత్కూరులో ప్రసన్న లక్ష్మి, అంజలి, చైత్ర అనే అక్కాచెల్లెళ్లు రెండు నెలల క్రితం కట్టెల మధ్య చిక్కుకున్న ఉడుత పిల్లను కాపాడారు. అప్పటి నుంచి దానికి ఆహారం అందిస్తూ ప్రేమగా పెంచుతున్నారు. దీంతో అది వారితో ఎంతో చనువుగా మారింది.
చిన్నారులు బడికి వెళ్లేటప్పుడు వారి వెంట వెళ్లి, తిరిగి ఇంటికి వస్తోంది. మనుషులు, మూగజీవాల మధ్య అనుబంధానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...
