Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూప్రాన్ శివాలయానికి పోటెత్తిన భక్తులు

Kiran Nov 11, 2026 11:10 AM మెదక్General
Add as a preferred source on Google
తూప్రాన్ శివాలయానికి పోటెత్తిన భక్తులు - Ushodayam
తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని శివాలయానికి కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. రామలింగేశ్వర స్వామివారికి అర్చకుడు మధుశాస్త్రి ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహిళలు ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించారు.

Comments

G
Loading comments...