Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ల పంట నష్టాల నమోదు వేగవంతం చేయండి: అచ్చెన్న

Harika Nov 10, 2026 2:25 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
తుఫాన్ల పంట నష్టాల నమోదు వేగవంతం చేయండి: అచ్చెన్న - Ushodayam
తుఫాన్లతో దెబ్బతిన్న పంటల నష్టాల నమోదును వేగవంతం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అర్నబ్‌, మురసు తుఫాన్లతో 4.61 లక్షల హెక్టార్ల వ్యవసాయ, 29,960 హెక్టార్ల ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. 7,09,405 మంది రైతులు ప్రభావితమయ్యారని వివరించారు. అర్నబ్‌తో రూ.2,392 కోట్లు, మురసుతో రూ.816 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశారు.

Comments

G
Loading comments...