వార్తలకు తిరిగి వెళ్లండి
ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు.. డ్రైవర్‌కు గాయాలు

రెడ్డిగూడెం మండలం రంగాపురం బాలయోగి గురుకుల పాఠశాల సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. విస్సన్నపేట నుంచి మైలవరం వెళ్తున్న బస్సు జేసీబీని తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న పామాయిల్ లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ ఆశేపల్లి నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Comments
Loading comments...
