వార్తలకు తిరిగి వెళ్లండి
టీచర్‌ను విడిచిపెట్టలేక కన్నీటిపర్యంతమైన విద్యార్థులు
నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో డిప్యూటేషన్ ముగిసి మాతృ పాఠశాలకు వెళ్తున్న టీచర్ శ్రీకాంత్‌ను విడిచి వెళ్లవద్దంటూ విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. ఏడాది కాలంగా ఆయన బోధనా తీరుతో విద్యార్థులు, గ్రామస్థుల ఆదరాభిమానాలను పొందారు.
విద్యార్థులను ఓదారుస్తూ శ్రీకాంత్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...
