వార్తలకు తిరిగి వెళ్లండి
తణుకు పారిశుద్ధ్యంపై వైసీపీ ఆందోళన

భారీ వర్షాలు, తుఫాన్ల అనంతరం తణుకులో పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని పట్టణ వైసీపీ అధ్యక్షుడు మరిశెట్టి శేషగిరి ఆరోపించారు. గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పది రోజులుగా మురుగునీరు నిల్వ ఉండటంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. నాయకులు వి.సీతారాం, బలరాం పాల్గొన్నారు.
Comments
Loading comments...
