వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కనులారా శ్రీవారి దర్శనానికి 15 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.
నిన్న 78,085 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 26,232 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.93 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...
