వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో పెరిగిన చలి.. 14.7 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 16 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14.7 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండలో అత్యల్పంగా 14.7 డిగ్రీలు నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్‌లో 17-19 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...
