వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ ఆర్టీసీ బస్‌స్టాండ్లలో సీసీటీవీ నిఘా

ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు తెలంగాణ ఆర్టీసీ అన్ని బస్‌స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి మంగళవారం వెల్లడించారు.
సీసీటీవీ వ్యవస్థను ప్రాంతీయ, ప్రధాన కార్యాలయాలతో అనుసంధానించి రద్దీ, ప్రయాణికుల రాకపోకలు, రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. మెరుగైన సేవలందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ తెలిపింది.
Comments
Loading comments...
