వార్తలకు తిరిగి వెళ్లండి
తాగునీటిని పొదుపుగా వాడుకోవాలి

ఎల్‌నినో ప్రభావంతో రాబోయే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని కొలనూర్ సర్పంచ్ జలగం అరవింద్‌రావు సూచించారు. గ్రామపంచాయతీ బోర్ల నీటిని తోటలు, వ్యవసాయ పనులకు మళ్లించవద్దని కోరారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటిని సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బిట్ల బాబు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...
