Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణకారులకు షాపులు కేటాయించాలని వినతి

Kiran Nov 12, 2026 1:03 PM సూర్యాపేటGeneral
Add as a preferred source on Google
స్వర్ణకారులకు షాపులు కేటాయించాలని వినతి - Ushodayam
కోదాడ పాత మున్సిపల్ కాంప్లెక్స్ వెనుక 30 ఏళ్లుగా దుకాణాలు నిర్వహిస్తున్న స్వర్ణకారులను కొత్త కాంప్లెక్స్ నిర్మాణంలో తొలగించారని సంఘ సభ్యులు తెలిపారు. కొత్త కాంప్లెక్స్‌లో షాపులు కేటాయిస్తామని గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి వినతిపత్రం అందజేశారు. తమ జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని కొత్త కాంప్లెక్స్‌లో షాపులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...