Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వదేశానికి 165 టన్నుల బంగారం తెచ్చిన ఆర్బీఐ

Sai Nath Nov 27, 2026 2:20 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
స్వదేశానికి 165 టన్నుల బంగారం తెచ్చిన ఆర్బీఐ - Ushodayam
విదేశాల్లోని వాల్ట్‌లలో భద్రపరిచిన 165 టన్నుల బంగారాన్ని 2025 సెప్టెంబర్‌ నుంచి 2026 సెప్టెంబర్‌ మధ్య ఆర్బీఐ భారత్‌కు తరలించింది. దీంతో దేశీయంగా ఉన్న స్వర్ణ నిల్వలు 575.82 టన్నుల నుంచి 740.13 టన్నులకు పెరిగాయి. విదేశాల్లో ఇంకా 140.39 టన్నుల బంగారం ఉంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత రష్యా ఆస్తులను పశ్చిమ దేశాలు స్తంభింపజేయడంతో భారత్‌ అప్రమత్తమైంది.

Comments

G
Loading comments...