వార్తలకు తిరిగి వెళ్లండి
హోసూర్‌లో రూ.779 కోట్లతో ఈవీ ప్లాంట్

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ తమిళనాడులోని హోసూర్ సమీపంలో రూ.779 కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. శూలగిరి సిప్‌కాట్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు.
ఇందులో ఏడాదికి 2.5 లక్షల వాహనాలు తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్లకు పెంచనుంది.
Comments
Loading comments...
