Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిడ్జిపై ప్రమాదకరంగా నడకమార్గం

Anuroop Nov 12, 2026 11:57 AM ఏలూరుGeneral
Add as a preferred source on Google
బ్రిడ్జిపై ప్రమాదకరంగా నడకమార్గం - Ushodayam
ఏలూరు సత్రంపాడు బ్రిడ్జిపై పాదచారుల నడకమార్గం అధ్వానంగా మారింది. సిమెంట్ పలకలు పలుచోట్ల పగిలి, విరిగిపోగా మరికొన్ని చోట్ల కాలువపై పలకలు తొలగిపోయాయి. దీంతో విద్యార్థులు, స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణనష్టం జరగకముందే అధికారులు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...