వార్తలకు తిరిగి వెళ్లండి
సర్పంచి బరిలో బి.ఫార్మసీ యువతి

తాళ్లరేవు మండలం ఇంజరం పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా బి.ఫార్మసీ నాలుగో సంవత్సరం విద్యార్థిని కావూరి గీతాంబిక(23) కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. ఇంజరం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో తండ్రి, తెదేపా సీనియర్ నేత కావూరి శ్రీనివాస్ స్ఫూర్తితో బరిలోకి దిగుతున్నారు.
ప్రజాసేవ చేయాలనే ఆకాంక్షతో చదువు కొనసాగిస్తూనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు గీతాంబిక తెలిపారు.
Comments
Loading comments...
