వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిసిల్లలో డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. పాన్ షాపులు, బస్టాండ్, కిరాణా దుకాణాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
భద్రతా చర్యల్లో భాగంగా అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులపై నిఘా ఉంచారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...
