వార్తలకు తిరిగి వెళ్లండి
బోటు కోసం గాలింపు ముమ్మరం: సీఎం

సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల బోటు ఆచూకీ కోసం గాలింపు విస్తృతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన మత్స్యకారులు నవంబర్ 4న వేటకు వెళ్లి, పారాదీప్ సమీపంలో ఈ నెల 19 నుంచి సంబంధాలు కోల్పోయారు.
కాకినాడ, చెన్నై, ఒడిశా కోస్ట్‌గార్డ్ సమన్వయంతో నౌకలు, హెలికాప్టర్ల ద్వారా గాలిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం సూచించారు.
Comments
Loading comments...
