వార్తలకు తిరిగి వెళ్లండి
సీతానగరం ఆలయంలో ముడుపుల పూజలు

సీతానగరం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ముడుపుల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల కోసం దూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు ఆలయ అర్చకుడు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు.
స్వామివారిని భక్తితో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసమని పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ సేవకులు తెలిపారు.
Comments
Loading comments...
