వార్తలకు తిరిగి వెళ్లండి
సీమా లాట్కర్‌కు స్థానభ్రంశం

మైసూరు నగర పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్‌ను కర్ణాటక ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆమెకు ఎలాంటి కొత్త బాధ్యతలు అప్పగించకుండా వెకెన్సీ రిజర్వులో ఉంచింది. 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఎన్.విష్ణువర్ధన్‌ను కొత్త కమిషనర్‌గా నియమించింది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దొంగతనాలు, దసరా ఉత్సవాల సందర్భంగా రాజకుటుంబంతో పోలీసుల వివాదాలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో బదిలీ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...
