వార్తలకు తిరిగి వెళ్లండి
సీఎం సహాయ నిధికి కేడీసీసీ బ్యాంక్ రూ.కోటి విరాళం

కృష్ణా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ తరఫున సీఎం సహాయ నిధికి రూ.కోటి విరాళం అందించారు. బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి చెక్కు అందజేశారు.
తుఫాన్లతో పంటలు నష్టపోయిన రైతులకు అండగా కామన్ గుడ్ ఫండ్ నుంచి ఈ విరాళం ఇచ్చినట్లు రఘురాం తెలిపారు. విరాళంపై సీఎం ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
