Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సభకు వెళ్తున్న నిర్వాసితుల అరెస్టు

Anuroop Nov 09, 2026 8:17 PM నారాయణపేటGeneral
Add as a preferred source on Google
సీఎం సభకు వెళ్తున్న నిర్వాసితుల అరెస్టు - Ushodayam
హాకీంపేటలో సీఎం సభకు వెళ్తున్న ఎంఎన్‌కే ప్రాజెక్టు నిర్వాసిత సంఘం గౌరవ అధ్యక్షుడు జి. వెంకట్రాంరెడ్డి సహా పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాయకులు ఎం. గోపాల్‌రెడ్డి, ధర్మరాజు గౌడ్‌లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిర్వాసితుల సమస్యలను సీఎంకు వివరించేందుకు వెళ్తుండగా తమ బస్సును కోస్గి పోలీస్‌స్టేషన్‌కు తరలించారని సంఘం నేతలు ఆరోపించారు.

Comments

G
Loading comments...